రక్తపాతం, మాఫియా, పోలీసుల ఛేజింగ్ లాంటివి లేకుండా వర్మ మూవీ ఉండనే ఉండదు. ఎప్పుడూ మాఫియా ఆలోచనలతో మూవీలు తీసే వర్మ జోలికి ఎవరైనా వెళ్ళడం అంటే దాదాపు తెలిసి తెలిసి పులిబోనులోకి వెళ్ళినట్టే. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతో ఎవ్వరూ మాట్లాడలేరు, గెలికి వాసన చూడలేరు. అలాంటిది రామ్‌గోపాల్‌వర్మనే ముప్పు తిప్పలు పెట్టిన ఓ లేడి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. తనే తెలుగు చలన చిత్ర సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మీ. ఈమె రామ్‌గోపాల్ వర్మను హింసించడమే కాకుండా వర్మకు ఆర్ధికపరమైన నష్టాన్ని, కుట్ర పూరితమైన అధిపత్యాన్ని, అసభ్యకరమైన పదజాలాన్ని ప్రదర్శించింది. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా చెబుతున్నట్టు సమాచారం. ఇదంతా సత్యా2 మూవీ రిలీజ్‌కు సంబంధించిన విషయంలో జరిగింది. సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మీ బాధలు భరించలేని వర్మ, సోమవారం నాంపల్లి స్టేషన్‌లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని టాలీవుడ్ అంటుంది. చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ధనలక్ష్మితో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చివరగా వర్మ మాత్రం సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మీ మీద కేసు నమోదు చేయటానికి రెడీ అయ్యాడు