నందమూరి వంశ వారసుడు యంగ్ టైగర్ కు ప్రస్తుతం ఉన్న అయోమయ పరిస్థితి తన సినిమా కెరియర్ లో ఎప్పుడూ లేదేమో అని అనిపిస్తుంది. ‘రామయ్యా వస్తావయ్యా’ ఘోర పరాజయం తరువాత జూనియర్ పై వచ్చినన్ని రూమర్లు ఎప్పుడు రాలేదు. ఆఖరికి ఎన్టీఆర్ తన దగ్గర పనిచేసే మేనేజర్ ను మార్చినా మీడియాలో ఆ వార్తకు రకరకాల అర్ధాలు ఇస్తూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సంతోషి శ్రీనివాస్ దర్సకత్వంలో సినిమాను చేస్తున్నా ఆ సినిమా తరువాత జూనియర్ చేస్తాడు అనుకున్న సినిమాల విషయంలో కూడా రకరకాల నెగిటీవ్ వార్తలతో జూనియర్ కెరియర్ పై కధనాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో ఐదవ స్థానానికి పడిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. మార్కెట్ పరంగా జూనియర్ స్థాయిని విశ్లేషిస్తే పవన్, మహేష్, ప్రభాస్, అల్లుఅర్జున్, చరణ్ వీరందరి తరువాత స్థానంలోనే జూనియర్ సినిమాలకు మార్కెట్ ఉందట. ‘రామయ్య’ సినిమా ఘోర పరాజయంతరువాత యన్టీఆర్ తను నటిస్తున్న సినిమాల విషయం పైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలలోను ఉన్న తన అభిమాన సంఘాల నాయకులను పిలిపించి తన ఇమేజ్ తగ్గడానికి గల కారణాలను స్పష్టంగా చేప్పమని తన అభిమాన సంఘాల నాయకులను అడిగాడట. దీనికి ఆ అభిమాన సంఘాల నాయకులు ఒక్క క్షణం కూడా మొహమాట పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు జూనియర్ ను ఆ వంశ వారసుడి గానే చూస్తారు కానీ, జూనియర్ గా వేరుగా అభిమానించమనీ, అందువల్ల నందమూరి కుటుంబంతో దూరం పెంచుకునే కొద్దీ జూనియర్ సినిమాలకు సూపర్ హిట్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని అని చెప్పడమే కాకుండా బాలయ్యతో జూనియర్ ప్రవర్తిస్తున్న ప్రస్తుత తీరు జూనియర్ ఇమేజ్ కి చాలా నెగిటీవ్ గా మారుతోందని చెప్పడమే కాకుండా బాలకృష్ణ వేరు, నందమూరి అభిమానులు వేరు అనే భావన నుండి జూనియర్ బయటకు రాకపోతే ఎంతమంది దర్శకులను మార్చినా ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో తాను కోరుకున్న బ్లాక్ బస్టర్స్ ను అందుకోలేడని, అందువల్ల బాలకృష్ణ తో వైరం తగ్గించుకోమని జూనియర్ అభిమాన సంఘాల నాయకులే జూనియర్ కు క్లాస్ ఇచ్చారు అంటు వార్తలు రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..