ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కన్‌ఫ్యూజన్ లో ఉన్నాడు. అదంతా రామయ్యా వస్తావయ్యా ఎఫెక్టే! ఈ సినిమా ఫ్లాప్ నుంచి తేరుకోవాలంటే అర్జెంటుగా ఓ హిట్ అందుకోవాలి. లేదంటే కనీసం హిట్ సినిమాలో నటిస్తున్నా - అనే భరోసా అయినా దక్కాలి. అందుకే హిట్ దర్శకుల వెంట పడుతున్నాడు.
తాజాగా సుకుమార్ లైన్‌లోకి వచ్చేశాడు. సుక్కు, ఎన్టీఆర్ కాంబినేషన్ ఎప్పటి నుంచో వినిపిస్తోందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ కథా చర్చల దశలకు కూడా వెళ్లలేదు. ఈసారి మాత్రం పక్కాగా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం '1' ఫలితం వచ్చే వరకూ ఆగాలని చూస్తున్నాడు.
చేతిలో ఆల్రెడీ హిట్టున్న త్రివిక్రమ్ నీ మళ్లీ లైన్‌లో పెట్టాలని చూస్తున్నాడు. అటు త్రివికమ్, ఇటు సుకుమార్... ఇద్దరూ ఎన్టీఆర్‌ని కన్‌ఫ్యూజన్‌లో నెట్టుతున్నారు. ఎవరిని ఎంచుకోవాలో అర్థం కావడం లేదు. ఒకవేళ 1 హిట్టయితే... సుకుమార్ ఎన్టీఆర్ వైపు చూస్తాడా? అన్నది అనుమానమే. మరి ఎన్టీఆర్‌ని ఒడ్డున పడేసే దర్శకుడు ఎవరో..?
టాగ్లు: NTR, Trivikram, Sukumar, One, Ramayya Vasthavayya,jr.ntr next movie,jr,ntr upcoming movie news,jr,ntr movie gossips