అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా తయారయింది టాలివుడ్ పరిస్థితి. పెద్ద సినిమాలు కావాలి బాబోయ్ అని నిన్నటిదాకా లబోదిబో మొత్తుకున్నా... సీమాంధ్ర ఉద్యమ ధాటికి భయపడి విడుదల తారీఖులని పద్మవ్యూహంలో పడేసిన బడా నిర్మాతలు, ఇప్పుడు మెల్లిగా కదులుతున్నారు. రామ్ చరణ్ తూఫాన్ ఇచ్చిన ఉత్సాహంతో అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య, భాయి... ఇలా ఒక దాని వెంట ఒకటి నిమజ్జనానికి తరలిన గణపయ్య లాగా బాక్సాఫీసుకు పయనం అవుతున్నాయి.
రానున్న అక్టోబర్ నెలల్లో దసరా ఉత్సాహం మొత్తం మన సినిమాల్లోనే కనపడేలా ఉంది. మొదటగా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిని అక్టోబర్ 9న, ఎన్టీయార్ రామయ్య వస్తావయ్యని అక్టోబర్ 10న ఘనంగా విడుదల చేస్తున్నామని ఆయా నిర్మాతలు దిల్ రాజు, ప్రసాద్ అఫీశియలుగా సెలవిచ్చారు. వీటి వెంటే నాగార్జున భాయి కూడా అక్టోబర్ నేలాఖరికో లేక నవంబర్ మొదటి వారంలోనో దిగనుంది. అంటే టాలివుడ్ బాక్సాఫీస్ సందడి మొదలయినట్టే.