ఇటీవలే తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న రణ్‌బీర్ కపూర్‌ని మీడియా పలకరించింది. బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అడిగింది. గాళ్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ ఏం గిఫ్ట్ ఇచ్చింది అని సరదాగా క్వశ్చన్ చేసింది. అయితే అతను మాత్రం అంత సరదాగా సమాధానం ఇవ్వలేదు. ''ఆమె ఏం బహుమతి ఇస్తే మీకేం.. అది నా వ్యక్తిగతం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి'' అని కఠినమై సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. అసలు ఆమె తనని కలవనేలేదన్నట్లు ఫోజు కొట్టాడు. కానీ అసలు విషయం మాత్రం వేరే వుందని మీడియా చెప్పుకుంటోంది.
ఆరోజు సాయంత్రం ఓ క్లాత్ స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లొచ్చిన రణ్‌బీర్.. ఆ తర్వాత రాత్రంతా కత్రినాతోనే సరదాగా టైమ్ పాస్ చేసినట్లు ముంబై మీడియా టాక్. అది కూడా ఇంకెక్కడో కాదు.. తన సొంత నివాసమైన 'క్రిష్ణ రాజ్'లోనే కత్రినాతో కలిసి ఎంజాయ్ చేసినట్లు వినికిడి. ఫోటోల ఆధారం లేనిదే ఏదీ అంగీకరించని రణ్ బీర్ ఇప్పుడు ఈ ఫోటోలు కూడా లీక్ అయితే తప్ప అసలు విషయం చెప్పడేమో!!