ఈ దసరా పండుగకు విడుదల అవుతుంది అని నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను శ్రుతి హసన్ చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హసన్ ఒక నేగెటీవ్ రోల్ చేస్తోంది అనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ వార్తలను దర్శకుడు హరీష్ శంకర్ ఖండించలేదు కాని శ్రుతి పాత్ర ఏమిటి అన్నది సస్పెన్స్ అంటున్నాడు. ఈ వార్తల నేపధ్యంలో శ్రుతి మాత్రం ఈ మధ్య మీడియా తో మాట్లాడుతూ తాను రామయ్యా వస్తావయ్యా లో చేస్తున్నది నేగెటీవ్ పాత్ర కాదని, కేవలం ఒక ప్రత్యేక పాత్ర అని ఈ సస్పెన్స్ కు తెర తీసింది. ఈ వార్తలను మీడియా లో చూసిన రామయ్యా వస్తావయ్యా సినిమా బయ్యర్లు షాక్ అయ్యారట.
దీనికి ప్రధాన కారణం శ్రుతి హసన్ రామయ్యా వస్తావయ్యా సినిమాలో నేగెటీవ్ పాత్ర చేస్తోంది అన్న టాక్ బయటకు రావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని, అయితే శ్రుతి పెరిగిపోయిన భారీ అంచనాలపై నీళ్ళు జల్లుతూ తనది నేగెటీవ్ పాత్ర కాదు అని చెప్పడంతో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఏర్పడిన సస్పెన్స్ బయటకు రావడమే కాకుండా శ్రుతి హసన్ అనాలోచితంగా మాట్లాడిన మాట రామయ్యా వస్తావయ్యా సినిమాకు శాపంగా మారింది అంటూ ఈ సినిమాను భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు బాధపడుతున్నారట. ఇంతకీ శ్రుతి హాసన్ అంత సత్య హరి చంద్రుడిలా ఈ సినిమాలోని తన పాత్ర పై ఇన్ని నిజాలు ఎందుకు చెప్పిందో ఆమె కే తెలియాలి. బహుశా శ్రుతి కీ, సమంతకి ఈ మధ్య పెరిగిపోతున్న ఇగో వార్ వల్ల శ్రుతి ఈ సినిమా గురించి నిజాలు చెప్పింది అనుకోవాలి.
English Summary It is heard that sruthi comments on Ramayya vasthavayya is a curse for that movie image...